బహిర్భూమికి వెళ్లాడు.. పేలుడుతో మృతి | man died with blast of chemical drum | Sakshi
Sakshi News home page

బహిర్భూమికి వెళ్లాడు.. పేలుడుతో మృతి

Aug 9 2016 10:02 PM | Updated on Aug 29 2018 8:36 PM

మృతుడు లోకేష్‌ - Sakshi

మృతుడు లోకేష్‌

బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి రసాయన డ్రమ్ము పేలడంతో శరీరం ముక్కలై అక్కడికక్కడే మృతి

కుత్బుల్లాపూర్‌: బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి రసాయన డ్రమ్ము పేలడంతో  శరీరం ముక్కలై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనాథ్ వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుడు లోకేష్‌ (21) వారం రోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి రాంరెడ్డినగర్‌లో తన సోదరుడు చిన్నయ్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం అతను ఫాక్‌సాగర్‌ సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు.

ఆ సమయంలో అక్కడ పడి ఉన్న ఓ రసాయన డ్రమ్ము నుంచి పొగలు వస్తుండటంతో దానిని తీసుకునేందుకు ప్రయత్నించగా పెద్ద శబ్ధంతో పేలిపోయింది. దీంతో కాలనీవాసులు అక్కడికి వచ్చి చూడగా లోకేష్‌ శరీరం తునాతునకలై పడి ఉంది. పేట్‌ బషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ రంగారెడ్డి, ఎస్సై శ్రీనాద్‌ అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతుని సోదరుడు చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement