సంతజూటూరు–బండిఆత్మకూరు మధ్య ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంగళరెడ్డిపేటకు చెందిన ఖాదర్‌హుసేన్(35) మరణించాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Jul 3 2017 12:16 AM | Updated on Aug 30 2018 4:10 PM
బండిఆత్మకూరు: సంతజూటూరు–బండిఆత్మకూరు మధ్య ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంగళరెడ్డిపేటకు చెందిన ఖాదర్‌హుసేన్(35) మరణించాడు. ప్రమాదంలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఖాదర్‌హుసేన్ వాడాల మద్దూరుకు చెందిన పసన్, పరమటూరుకు చెందిన మరో వ్యక్తి బైక్‌పై పరమటూరులో జరిగే పెళ్లి కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంతజూటూరు సమీపంలో ఉన్న మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పింది. దీంతో ఖాదర్‌హుసేన్ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న అసన్, మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. మృతుడు ఖాదర్‌హుసేన్‌కు భార్య షేకున్‌బీ, ఇద్దరు కుమారులున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement