అడుగుల దూరంలో ఆగిన మృత్యువు | loco pelait stop train when he's watch some one on track commit to sucide | Sakshi
Sakshi News home page

అడుగుల దూరంలో ఆగిన మృత్యువు

May 20 2016 3:09 AM | Updated on Nov 6 2018 7:56 PM

అడుగుల దూరంలో ఆగిన మృత్యువు - Sakshi

అడుగుల దూరంలో ఆగిన మృత్యువు

అర నిమిషం గడిచి ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. కానీ రైలు డ్రైవర్ అతని ప్రాణాలను కాపాడి కొత్త జీవితాన్నిచ్చాడు.

భార్యతో గొడవపడి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి
గుర్తించి రైలు ఆపిన లోకో పెలైట్

 అనంతపురం: అర నిమిషం గడిచి ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. కానీ రైలు డ్రైవర్ అతని ప్రాణాలను కాపాడి కొత్త జీవితాన్నిచ్చాడు. దీంతో మృత్యువు కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ( పీటీసీ) సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ కింద చోటు చేసుకుంది. కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన ముత్యాలు, జయమ్మ భార్యాభర్తలు.

ముత్యాలు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్యా భర్తల మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ముత్యాలు ఆత్మహత్యకు యత్నించాడు.ఈ క్రమంలో అతను అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరిన గుంతకల్లు- హిందూపురం ప్యాసింజర్ రైలుకింద పడాలనుకున్నాడు.లోకోపెలైట్ దూరం నుంచే గుర్తించి బ్రేక్ వేశాడు. సుమారు పదడుగుల దూరంలోకి వచ్చి రైలు ఆగిపోయింది. లోకో పెలైట్ ముత్యాలును  లేపి పక్కకు తప్పించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ముత్యాలును అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement