breaking news
loco pelait
-
లోకో పైలట్ హత్య కేసు: నిందితుడు చిక్కాడు
విజయవాడ, సాక్షి: విజయవాడలో లోకో పైలట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే అనుమానాస్పదంగా ఉన్న దేవ్కుమార్ను లోకో పైలట్ ప్రశ్నించాడు. దీంతో ఇనుపరాడ్‌తో లోకో పైలట్‌పై నిందితుడు దాడి చేశాడని రైల్వే ఏసీసీ రత్న వెల్లడించారు. మచిలీపట్నం వద్ద నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్–క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు.రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు.చదవండి: అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు -
అడుగుల దూరంలో ఆగిన మృత్యువు
♦ భార్యతో గొడవపడి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి ♦ గుర్తించి రైలు ఆపిన లోకో పెలైట్ అనంతపురం: అర నిమిషం గడిచి ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. కానీ రైలు డ్రైవర్ అతని ప్రాణాలను కాపాడి కొత్త జీవితాన్నిచ్చాడు. దీంతో మృత్యువు కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ( పీటీసీ) సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ కింద చోటు చేసుకుంది. కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన ముత్యాలు, జయమ్మ భార్యాభర్తలు. ముత్యాలు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్యా భర్తల మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ముత్యాలు ఆత్మహత్యకు యత్నించాడు.ఈ క్రమంలో అతను అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరిన గుంతకల్లు- హిందూపురం ప్యాసింజర్ రైలుకింద పడాలనుకున్నాడు.లోకోపెలైట్ దూరం నుంచే గుర్తించి బ్రేక్ వేశాడు. సుమారు పదడుగుల దూరంలోకి వచ్చి రైలు ఆగిపోయింది. లోకో పెలైట్ ముత్యాలును లేపి పక్కకు తప్పించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ముత్యాలును అదుపులోకి తీసుకున్నారు.