ప్రత్యేక హోదా కోసం లాయర్ల ధర్నా | lawyers protest at rajamahendravaram due to on AP special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం లాయర్ల ధర్నా

Aug 5 2016 11:51 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో న్యాయవాదులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాజమండ్రి బార్ అసోసియేషన్, కోస్తా రీజియన్ బార్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ధర్నాకు దిగారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవశ్యకతపై నాయవాద సంఘాల నేతలు ముప్పాళ్ల సుబ్బారావు, హనుమంతరావు తదితరులు ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించి ఎన్నికల హామీని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భారీ సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement