రోడ్డు ప్రమాదంలో న్యాయవాది దుర్మరణం | lawyer dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో న్యాయవాది దుర్మరణం

Feb 1 2017 11:37 PM | Updated on Aug 30 2018 4:10 PM

మడకశిరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగేపల్లికి చెందిన న్యాయవాది లోకేష్‌రెడ్డి (35) దుర్మరణం చెందారు.

మడకశిర రూరల్‌ : మడకశిరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగేపల్లికి చెందిన న్యాయవాది లోకేష్‌రెడ్డి (35) దుర్మరణం చెందారు. వివరాలిలావున్నాయి... మంగళవారం సాయంత్రం పనినిమిత్తం పట్టణానికి చెందిన మారుతి, లోకేష్‌రెడ్డిలు ద్విచక్రవాహనంలో పావగడకు వెళ్లారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో తిరిగి వస్తుండగా మడకశిరలోని చంద్రమౌళేశ్వరస్వామి దేవాలయ సమీపంలోని స్పీడ్‌బ్రేకర్‌ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి ముళ్లపొదల్లోకి పడిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న లోకేష్‌రెడ్డిని కొంతసేపటి తర్వాత ఆటు వెళుతున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని అతడిని బెంగళూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మరో యువకుడు మారుతి స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. లోకేష్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మక్బూల్‌బాషా కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు కే ఆనందరంగారెడ్డి, రైతు సంఘం కార్యదర్శి ఎస్‌ఆర్‌ అంజినరెడ్డి, నాయకులు వెంకటరంగారెడ్డి, వెంకటేష్, సర్పంచు పుట్టమ్మ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వివిధ పార్టీల నాయకులు, రెడ్డి సంఘం నాయకులు వెంకటసుబ్బారెడ్డి , రవిశంకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చౌడరెడ్డి తదితరులు మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. లోకేష్‌రెడ్డి మృతిపట్ల బుధవారం జడ్డి రమేష్‌నాయుడు, న్యాయవాదులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement