పంపనూరులో కోటి దీపార్చన | koti deeparchana in pampunur | Sakshi
Sakshi News home page

పంపనూరులో కోటి దీపార్చన

Nov 20 2016 11:01 PM | Updated on Sep 4 2017 8:38 PM

పంపనూరులో కోటి దీపార్చన

పంపనూరులో కోటి దీపార్చన

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు మండలంలోని పంపనూరులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం కోటి దీపార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు.

ఆత్మకూరు : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు మండలంలోని పంపనూరులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం కోటి దీపార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. దీప కాంతులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగొందింది. కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు రాము, అన్నదాన కమిటీ చైర్మన్‌ సత్యరంగయ్య, ఆలయ కమిటీ చైర్మన్‌ తలుపూరు కృష్ణారెడ్డి, సర్పంచ్‌ పద్మావతి పర్యవేక్షించారు.

Advertisement

పోల్

Advertisement