ఖాజీపాలెం విద్యార్థినుల ప్రతిభ | Khajipalem students got medals in athletics | Sakshi
Sakshi News home page

ఖాజీపాలెం విద్యార్థినుల ప్రతిభ

Oct 13 2016 8:37 PM | Updated on Sep 4 2017 5:05 PM

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్‌ పోటీలలో ఖాజీపాలెం డాక్టర్‌ డీఎస్‌ రాజు జూనియర్‌ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించినట్లు..

ఖాజీపాలెం (పిట్టలవానిపాలెం): రాష్ట్ర స్థాయి  అథ్లెటిక్‌ పోటీలలో ఖాజీపాలెం  డాక్టర్‌ డీఎస్‌ రాజు జూనియర్‌ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ  ప్రతిభ  కనబరచి రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ భేతాళం సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం క్రీడాకారులను పలువురు అభినందించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9 వరకు ఆంధ్రప్రదేశ్‌ స్కూలు గేమ్స్‌ ఫెడరేషన్‌ అథ్లెటిక్స్‌ (అండర్‌–19) పోటీలు గుంటూరు నగరంలోని అవుట్‌ డోర్‌ స్టేడియంలో జరిగాయన్నారు. 1500, 800  మీటర్ల పరుగు పందెంలో కళాశాలకు చెందిన  కె.వరలక్ష్మి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, వై.సంధ్యారాణి 3 కి.మీ పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం సాధించారన్నారు.  రిలే పరుగు పందెంలో ౖÐð..సంధ్యారాణి, కె.వరలక్ష్మి, ఎం.ప్రసన్న, ఐ.దేవి వైష్ణవి కాంస్య పతకం సాధించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement