గారడీ చేస్తున్న కేసీఆర్‌ | KCR is juggling | Sakshi
Sakshi News home page

గారడీ చేస్తున్న కేసీఆర్‌

Sep 12 2016 12:05 AM | Updated on Sep 4 2017 1:06 PM

శ్రీనివాసరెడ్డి స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న సంధ్య

శ్రీనివాసరెడ్డి స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న సంధ్య

ఎన్నికల ముందు కేసీఆర్‌ ఇచ్చిన హమీలను విస్మరించి మాయమాటలు చెప్పి కాలం గడుపుతున్నారని పీఓడబ్ల్యూ జాతీయ కౌన్సిలర్‌ సంధ్య అన్నారు.

  • పీఓడబ్ల్యూ జాతీయ కౌన్సిలర్‌ సంధ్య 
  • తిరుమలాయపాలెం: ఎన్నికల ముందు కేసీఆర్‌ ఇచ్చిన హమీలను విస్మరించి మాయమాటలు చెప్పి కాలం గడుపుతున్నారని పీఓడబ్ల్యూ జాతీయ కౌన్సిలర్‌ సంధ్య అన్నారు. పార్టీ నాయకులు అన్నం శ్రీనివాసరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థూపాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో అధికారం కోసం అనేక హమీలు ఇచ్చి నేడు తుంగలో తొక్కారన్నారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఏమైందని ప్రశించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ఊసే ఎత్తటం లేదన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ సర్కార్‌ ప్రజా సమస్యల వైఫల్యాలపై  క్షేత్ర స్థాయిలో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం పని చేసిన అన్నం శ్రీనివాసరెడ్డి ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్‌ న్యూడెమెక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్, ఎం.శ్రీనివాస్, కోలేటి నాగేశ్వరరావు, నిర్మలా, తిమ్మడి సైదయ్య, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement