పుట్టపర్తికి చేరిన ఇండోర్‌ భక్తుడి పాదయాత్ర | Indoor devotee walked to Puttaparthi | Sakshi
Sakshi News home page

పుట్టపర్తికి చేరిన ఇండోర్‌ భక్తుడి పాదయాత్ర

Jun 14 2017 10:20 PM | Updated on Oct 8 2018 3:17 PM

పుట్టపర్తికి చేరిన ఇండోర్‌ భక్తుడి పాదయాత్ర - Sakshi

పుట్టపర్తికి చేరిన ఇండోర్‌ భక్తుడి పాదయాత్ర

సత్యసాయి సేవలు, ఆధ్యాత్మిక బోధనల పట్ల ప్రజలను చైతన్యం చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సత్యసాయి భక్తుడు సతీష్‌ చేపట్టిన పాదయాత్ర బుధవారం పుట్టపర్తికి చేరుకుంది. 2016 అక్టోబర్‌ 20న ఇండోర్‌లో పాదయాత్ర ప్రారంభించిన ఆయన సత్యసాయి చిత్రపటాన్ని, ఆయన బోధించిన బోధనలతో కూడిన ప్ల కార్డులతో పాదయాత్రగా పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ఆయనకు సత్యసాయి పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలి

పుట్టపర్తి టౌన్‌ : సత్యసాయి సేవలు, ఆధ్యాత్మిక బోధనల పట్ల ప్రజలను చైతన్యం చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సత్యసాయి భక్తుడు సతీష్‌ చేపట్టిన పాదయాత్ర బుధవారం పుట్టపర్తికి చేరుకుంది. 2016 అక్టోబర్‌ 20న ఇండోర్‌లో పాదయాత్ర ప్రారంభించిన ఆయన సత్యసాయి చిత్రపటాన్ని, ఆయన బోధించిన బోధనలతో కూడిన ప్ల కార్డులతో పాదయాత్రగా పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ఆయనకు సత్యసాయి పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ప్రజా సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన సేవాస్పూర్తిని, ఆధ్యాత్మిక బోధనలతో అందరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్గ మధ్యలో ప్రజలకు సత్యసాయి చరిత్రను వివరించానన్నారు.  గతంలో ఇండోర్‌ నుండి మహారాష్ట్రలోని షిర్డీకి, హిమాచల్‌ప్రదేశ్‌లోని వైష్టోదేవి ఆలయానికి పాదయాత్ర చేపట్టానన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement