చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్, ఇన్‌స్పైర్ అవార్డ్సు ఎగ్జిబిషన్ జిల్లా పరిశీలకురాలు లక్ష్మీవాట్స్ పేర్కొన్నారు.
శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించండి
Oct 17 2016 12:43 AM | Updated on Sep 4 2017 5:25 PM
– ఇన్‌స్పైర్ ముగింపు వేడుకల్లో ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్ లక్ష్మీవాట్స్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్, ఇన్‌స్పైర్ అవార్డ్సు ఎగ్జిబిషన్ జిల్లా పరిశీలకురాలు లక్ష్మీవాట్స్ పేర్కొన్నారు. దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఇన్‌స్పైర్ అవార్డ్సు ఎగ్జిబిషన్ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల్లో తరగతి గది బోధన ఆసక్తిని రెకెత్తించేలా ఉండాలని సూచించారు. జిల్లా ఆర్‌కే రవికృష్ణ దంపతులు తమ పిల్లలతో కలసి ఎగ్జిబిషన్‌ను సందర్శించి విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. చిన్నారుల అద్భుత ప్రదర్శనను ఆయన మెచ్చుకొని అభినందించారు.
రాష్ట్రస్థాయి ప్రదర్శనకు 23 మంది ఎంపిక
రెండు రోజుల ఎగ్జిబిషన్‌లో ఉత్తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించిన 23 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. కర్నూలు, ఆదోని డివిజన్లకు సంబంధించి మొత్తం 225 ఎగ్జిబిట్లను ప్రదర్శించా అందులో 23 ప్రదర్శనలకు రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయి. వీరు త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనవచ్చు. జిల్లా స్థాయిలో ఉత్తమ బహుమతులను పొందిన విద్యార్థులకు ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్ లక్ష్మీవాట్స్ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీవైఈఓలు తహెరాసుల్తానా, శివరాములు, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్లు రామ్మోహన్, నాగరాజు, విజయకుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement