వట్లూరులో విజిలెన్స్‌ దాడి | in vatlur vijelence ride | Sakshi
Sakshi News home page

వట్లూరులో విజిలెన్స్‌ దాడి

Dec 1 2016 12:41 AM | Updated on Sep 4 2017 9:32 PM

వట్లూరు(పెదపాడు) : వట్లూరు గ్రామంలోని ఓ హోటల్‌పై విజిలెన్‌స అధికారులు బుధవారం దాడి చేశారు.

 వట్లూరు(పెదపాడు) :  వట్లూరు గ్రామంలోని ఓ హోటల్‌పై విజిలెన్‌స అధికారులు బుధవారం దాడి చేశారు.  విజిలెన్‌
స ఏవో శ్రీనివాసకుమార్‌ కథనం ప్రకారం.. పెదపాడు మండలంలోని వట్లూరు  గేట్‌ సెంటర్‌లో హోటల్‌ నడుపుతున్న తూము శ్రీనివాసరావు వద్ద అనధికారకంగా గ్యాస్‌ సిలిండర్లు ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్పీ వి.సురేష్‌ బాబు ఆదేశాల మేరకు  విజిలెన్‌స తహసీల్దార్‌ వి.శైలజ, విజిలెన్‌స ఏవో ఎం.శ్రీనివాస కుమార్‌ దాడిచేశారు. శ్రీనివాసరావు వద్ద ఉన్న ఆరు ఖాళీ సిలిడర్లు, రెండు నిండు సిలిండర్ల గురించి సరైన సమాధానం లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని అతనిపై నిత్యావసరవస్తువుల చట్టం 1959 సెక్షన్‌7(1)  ప్రకారం.. కేసు నమోదు చేసినట్లువిజిలెన్‌స ఏవో  శ్రీనివాసకుమార్‌ తెలిపారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement