రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి | in train one person died | Sakshi
Sakshi News home page

రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Aug 3 2016 12:39 AM | Updated on Mar 28 2019 6:33 PM

భీమవరం టౌన్‌ : నాగర్‌సోల్‌–నర్సాపురం రైలు ఎస్‌–5 కోచ్‌లో మంగళవారం ప్రయాణిస్తూ అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

భీమవరం టౌన్‌ : నాగర్‌సోల్‌–నర్సాపురం రైలు ఎస్‌–5 కోచ్‌లో మంగళవారం ప్రయాణిస్తూ అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. భీమవరం జీఆర్పీ ఎస్సై జి.ప్రభాకర్‌ కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తిని నర్సాపురం రైల్వే స్టేషన్‌లో ఉన్న పుష్కర వైద్య శిబిరం బృందం 108 అంబులెన్సులో నర్సాపురం ప్రభుత్వాస్పత్రికి పంపించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండొచ్చు. ఎత్తు 5.6 అడుగులు, నలుపు రంగులో ఉన్నాడు. ముక్కుపొడి రంగు ఫ్యాంటు, క్రీమ కలర్‌ చొక్కా ధరించి ఉన్నాడు.  
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement