హుస్నాబాద్‌ మీదుగా నేషనల్‌హైవే | highway on husnabad | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌ మీదుగా నేషనల్‌హైవే

Aug 23 2016 10:39 PM | Updated on Sep 4 2017 10:33 AM

హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, హుస్నాబాద్‌ మీదుగా నేషనల్‌ హైవే రోడ్డు మంజూరైనట్లు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్‌ మీదుగా సిద్దిపేట, రామాయంపేట్, మెదక్, నాందేడ్‌ నుంచి ముంబయి హైవే వరకు (దాదాపు 300 కిలోమీటర్లు) జాతీయ హైవే రోడ్డు మంజూరైనట్లు పేర్కొన్నారు. నిధుల విడుదలకు సంబంధించిన జీవో రెండు రోజుల్లో వెలువడుతుందన్నారు.

హుస్నాబాద్‌ : హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, హుస్నాబాద్‌ మీదుగా నేషనల్‌ హైవే రోడ్డు మంజూరైనట్లు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్‌ మీదుగా సిద్దిపేట, రామాయంపేట్, మెదక్, నాందేడ్‌ నుంచి ముంబయి హైవే వరకు (దాదాపు 300 కిలోమీటర్లు) జాతీయ హైవే రోడ్డు మంజూరైనట్లు పేర్కొన్నారు. నిధుల విడుదలకు సంబంధించిన జీవో రెండు రోజుల్లో వెలువడుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జాతీయ హైవే రోడ్డు లేదని, అందుకే మంజూరు చేయించినట్లు వివరించారు. హైవేరోడ్డు మంజూరు చేసిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్గరీ, సీఎం కేసీఆర్, రోడ్లు, భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, భారీనీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement