బీర కాదు.. ‘భీమ’ కాయలు | heavy ridge gourd | Sakshi
Sakshi News home page

బీర కాదు.. ‘భీమ’ కాయలు

Sep 19 2016 9:17 PM | Updated on Sep 4 2017 2:08 PM

సాధారణంగా దేశవాళీ రకం బీర కాయలు రెండు వందల నుంచి మూడొందల గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. అంతకు మించి తూగడం చాలా అరుదు. అయితే గోగన్నమఠంలో భూపతిరాజు సతీష్‌రాజు ఇంటి పెరట్లో దేశవాళీ బీరపాదుకు కాసిన కాయల్లో కొన్ని కేజీ బరువు తూగుతున్నాయి. చూడ్డానికి తక్కువ పొడవు ఉన్నా వాటి బరువు మాత్రం భారీగా ఉండడం విశేషం. స్థానికులు ఈ బీరకాయలను ఆసక్తిగా చూస్తున్నారు.

గోగన్నమఠం (మామిడికుదురు):
సాధారణంగా దేశవాళీ రకం బీర కాయలు రెండు వందల నుంచి మూడొందల గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. అంతకు మించి తూగడం చాలా అరుదు. అయితే గోగన్నమఠంలో భూపతిరాజు సతీష్‌రాజు ఇంటి పెరట్లో దేశవాళీ బీరపాదుకు కాసిన కాయల్లో కొన్ని కేజీ బరువు తూగుతున్నాయి. చూడ్డానికి తక్కువ పొడవు ఉన్నా వాటి బరువు మాత్రం భారీగా ఉండడం విశేషం. స్థానికులు ఈ బీరకాయలను ఆసక్తిగా చూస్తున్నారు. బీర కాయల ‘భీమ’ పరిమాణంపై ఉద్యాన శాఖాధికారి శైలజను సోమవారం ‘సాక్షి’ వివరణ కోరగా పెరట్లో మొట్టమొదటిసారిగా బీర పాదు పెట్టడం వల్ల అది భూమిలో ఉన్న పోషకాలను విరివిగా గ్రహించి అధిక బరువు గల కాయలు కాస్తోందన్నారు. ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుందన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement