తిరుమలలో బుధవారం వేకువజామునుంచి కుండపోతగా వర్షం పడుతోంది.
-తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల
తిరుమలలో బుధవారం వేకువజామునుంచి కుండపోతగా వర్షం పడుతోంది. దాంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భక్తులు చాలీ ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బుధవారం ఉదయం శ్రీవారి దర్శనార్థం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది.