
లోపల సమావేశం.. బయట కాలక్షేపం
విద్యాశాఖ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో మంగళవారం స్థానిక బాలుర ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యాశాఖ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో మంగళవారం స్థానిక బాలుర ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమావేశానికి వచ్చిన హెచ్‌ఎంలు స్థలం లేక కొందరు హాలు బయట కూర్చొని కబుర్లు చెప్పుకోగా, మరికొందరు చెట్ల కింద కాలక్షేపం చేశారు.
వందలాది మంది హెచ్‌ఎంలు సమావేశానికి హాజరుకాగా కూర్చోవడానికి స్థలం లేక సుమారు 20 శాతం పైగా బయట ఉండాల్సిన పరిస్థితి. ఎంతో దూరం నుంచి ఇక్కడకు వస్తే అధికారుల సందేశం వినే పరిస్థితి లేదంటూ వారు నిట్టూర్చారు. అందరికీ సరిపడే వేదికను ఏర్పాటు చేయడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేశారంటూ మండిపడ్డారు. తాము ఇంతదూరం వచ్చి ఏంలాభమని మండిపడ్డారు.