‘స్వీట్‌’గా గుట్కా వ్యాపారం | gutka bussiness | Sakshi
Sakshi News home page

‘స్వీట్‌’గా గుట్కా వ్యాపారం

Published Sun, Jul 24 2016 10:48 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

‘స్వీట్‌’గా గుట్కా వ్యాపారం - Sakshi

నిజామాబాద్‌ క్రైం : గుట్కా అక్రమ వ్యాపారులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఉండడంతో స్వీట్‌ సుఫారీల మాటున దందా సాగిస్తున్నారు. ఇలా గుట్కాపై నిషేధం అపహాస్యపం పాలవుతున్నా అధికారులు స్పందించడం లేదు. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 
పొగాకు సంబంధిత ఉత్పత్తి అయిన గుట్కా నమలడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. పొగాకు ఉత్పత్తులతో తయారైన గుట్కాలను అమ్మడం చట్టరీత్యా నేరం. పొగాకు కలపకుండా కేవలం వక్క పలుకులు, సుగంధ పరిమళం ఉండే పాన్‌ మసాలా, స్వీట్‌ సుపారీ, వక్క పొట్లాల అమ్మకంపై ఎటువంటి నిషేధం లేదు. దీనిని గుట్కా దందా చేస్తున్నవారు తమ వ్యాపారానికి అండగా చేసుకున్నారు. నిషేధం లేని పాన్‌ మసాలా, స్వీట్‌ సుపారీలను అడ్డం పెట్టుకుని గుట్కాను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారు. పాన్‌ మసాలా, స్వీట్‌ సుపారీలను బహిరంగంగా విక్రయిస్తూ వీటికి అనుబంధంగా పొగాకు పొడిని ప్రత్యేకంగా అమ్ముతున్నారు. గుట్కాలు కావాల్సిన వారు పాన్‌ మసాలా, పొగాకు పొడిని మార్కెట్‌లో ఒకే షాపులో వేర్వేరు ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండింటీనీ కలిపితే గుట్కా తయారవుతుంది. ప్రత్య„ý ంగా పొగాకు ఉత్పత్తులైన గుట్కాలు, ఖైనీలనూ బహిరగంగానే విక్రయిస్తున్నారు.
కర్ణాటక, మహారాష్ట్రల నుంచి..
గుట్కాపై నిషేధం ఉండడంతో రాష్ట్రంలో వాటి తయారీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి గుట్కాలను దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల్లోని కర్ణాటక ప్రాంతంలో గుట్కా తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పినట్లు తెలుస్తోంది. అక్కడ తయారు చేసిన గుట్కాను మద్నూర్‌ మీదుగా జిల్లాలోకి  రవాణా చేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి బోధన్‌ మీదుగా జిల్లాలోకి చేరవేస్తున్నారు. వీటిని నిషేధం లేని వస్తువుల మధ్యలో ప్యాక్‌ చేసి ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా రహస్య స్థావరాలకు తీసుకువస్తున్నారు. అనువైన సమయం చూసి జిల్లాలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గుట్కా వ్యాపారం జిల్లా అంతటా యథేచ్ఛగా సాగుతోంది. ఈ విషయం తెలిసినా పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యాపారాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి గుట్కా అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement