
పాస్‌పోర్టు సేవా కేంద్రం మంజూరు
వరంగల్ వరంగల్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం మంజూరైంది.
అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్
వరంగల్ వరంగల్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం మంజూరైంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వరంగల్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. వరంగల్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇటీవల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు.
దీనికి సమాధానంగా సుష్మాస్వరాజ్ ఎంపీ కవితకు ఫిబ్రవరి 27న లేఖ రాస్తూ హన్మకొండ నక్కలగుట్టలోని హెడ్ పోస్టాఫీసులో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తపాలా శాఖతో కలిసి దేశ వ్యాప్తంగా పలు నగరాల్లోనూ పోస్టాఫీసులలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని పోస్టాఫీసు పాస్‌పోర్టు కేంద్రాలుగా పిలవనున్నారు. త్వరలోనే ఇలాంటిది హన్మకొండలో ఏర్పాటు కానుంది.