రగ్బీతో మంచి భవిత | good future with ragbi game | Sakshi
Sakshi News home page

రగ్బీతో మంచి భవిత

Aug 20 2016 1:05 AM | Updated on Sep 4 2017 9:58 AM

రగ్బీతో మంచి భవిత

రగ్బీతో మంచి భవిత

గండవరం(కొడవలూరు): రగ్బీ ఆటలో నైపుణ్యాన్ని సంపాదిస్తే మంచి భవిష్యత్తు ఉందని ముం బైకు చెందిన రగ్బీ ఇండియా డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ నోయల్‌ మాథ్యూస్‌ తెలిపారు. రగ్బీలో మూడు రోజుల శిక్షణ ఇచ్చేందుకు గానూ రగ్బీ ఇండియా జట్టు ప్లేయర్‌ వెంకట్‌తో కలిసి గురువారం గండవరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చారు.

 
గండవరం(కొడవలూరు): రగ్బీ ఆటలో నైపుణ్యాన్ని సంపాదిస్తే మంచి భవిష్యత్తు ఉందని ముం బైకు చెందిన రగ్బీ ఇండియా డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ నోయల్‌ మాథ్యూస్‌ తెలిపారు. రగ్బీలో మూడు రోజుల శిక్షణ ఇచ్చేందుకు గానూ రగ్బీ ఇండియా జట్టు ప్లేయర్‌ వెంకట్‌తో కలిసి గురువారం గండవరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చారు. రగ్బీ ప్రాధాన్యంపై పాఠశాలలో నిర్వహిం చిన అవగాహన కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు.రగ్బీ ఆట ఒలింపిక్స్‌లో కూడా ప్రవేశం సాధిం చిందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ ఆటపై మక్కువ కనబరుస్తున్నాయని చెప్పారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోతోందంటే అందులో తల్లిదండ్రులు పాత్ర ఎంతో ఉందన్నారు.అత్యధిక శాతంమంది తల్లిదండ్రులు తమ పిల్లలు క్రీడాకారులు కావాలని కోరుకోకపోవ డం కూడా దేశం క్రీడల్లో వెనుకబడటానికి కారణమన్నారు.శిక్షణకు మండలంనుంచే కాక సమీప ప్రాం తాల నుంచి 200 మంది విద్యార్థులు తరలివచ్చారు. జిల్లా రగ్బీ అసోసియేషన్‌ కార్యదర్శి రమేష్, హెచ్‌ఎం పద్మావతి, పీఈటీ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement