ఉత్సాహంగా గోకార్టింగ్‌ పోటీలు | gocarting games | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా గోకార్టింగ్‌ పోటీలు

Jan 29 2017 11:56 PM | Updated on Nov 9 2018 4:45 PM

ఉత్సాహంగా గోకార్టింగ్‌ పోటీలు - Sakshi

ఉత్సాహంగా గోకార్టింగ్‌ పోటీలు

భీమవరం: భీమవరం విష్ణు ఇంజినీరింగ్‌ మహిళా కళాశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న గోకార్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2017 పోటీల్లో భాగంగా ఆదివారం విద్యార్థులు రూపొందించిన వాహనాలకు వివిధ రకాల సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.

భీమవరం: భీమవరం విష్ణు ఇంజినీరింగ్‌ మహిళా కళాశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న గోకార్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2017 పోటీల్లో భాగంగా ఆదివారం విద్యార్థులు రూపొందించిన వాహనాలకు వివిధ రకాల సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. పోటీలను భీమవరం మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ నాగనర్సింహరావు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వ్యయప్రయాలకోర్చి పాల్గొనడం అభినందనీయమన్నారు. స్కిడ్‌ పాడ్‌ పరీక్షల్లో భాగంగా వాహనాలను ఎనిమిది అంకె ఆకారంలో ప్రత్యేకంగా నిర్మించిన దారిలో నిర్ణీత సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా నడిపి విజయం సా«ధించాలి. ఆటోక్రాస్‌ టెస్ట్‌లో క్లిష్టమైన మలుపులు గల రహదారిలో తక్కువ సమయంలో పూర్తిచేసి విజయం సాధించాల్సి ఉంటుంది. గరిష్ట వేగ నిర్ధారణ పరీక్షల్లో వాహనాలు నిర్దేశించిన 50 కిలోమీటర్ల దూరాన్ని ఎంత తక్కువ సమయంలో పూర్తిచేస్తాయో నిర్ధారిస్తారు. తక్కువ సమయంలో పూర్తి చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. వాహనాల పరీక్షల అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన  సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement