బాలికల తరలింపు కేసులో.. | Girls in the move .. | Sakshi
Sakshi News home page

బాలికల తరలింపు కేసులో..

Aug 1 2016 11:14 PM | Updated on Sep 4 2017 7:22 AM

కడప రైల్వేస్టేషన్‌ పరిధిలో ఇటీవల కడప నుంచి చెన్నైకి టైలరింగ్‌ శిక్షణ, ఉపాధి కల్పిస్తామని బాలికలను తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఐసీడీఎస్, ఐసీపీఎస్‌ అధికారులు తెలుసుకుని పోలీసుల సహకారంతో రక్షించారు.

కడప అర్బన్‌ :

కడప రైల్వేస్టేషన్‌ పరిధిలో ఇటీవల కడప నుంచి చెన్నైకి టైలరింగ్‌ శిక్షణ, ఉపాధి కల్పిస్తామని బాలికలను తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఐసీడీఎస్, ఐసీపీఎస్‌ అధికారులు తెలుసుకుని పోలీసుల సహకారంతో రక్షించారు. వారిని శిశు సదన్‌లో ఉంచి సంరక్షిస్తున్నారు. మరోవైపు గత నెల 30న ఐసీపీఎస్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ శివప్రసాద్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 31న రాత్రి ఎనిమిది మందిని ఆర్టీసీ బస్టాండు సమీపంలో అరెస్టు చేశారు. వన్‌టౌన్‌ సీఐ రమేష్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి, తమ సిబ్బందితో కలిసి వీరిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కె.యోబు, దేవదానం, పుల్లయ్య, ప్రసాద్, ప్రసాద్, రమేష్, రవి, పుల్లయ్యలు ఉన్నారు. వీరిని మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచగా రిమాండుకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement