గణపతి నవరాత్రులను విజయవంతం చేసేం దుకు అధికారులు కృషి చేయాల ని జిల్లా రెవెన్యూ అధికారి కె.శోభ సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమి టీ సభ్యులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు.
గణపతి నవరాత్రులను విజయవంతం చేయాలి
Aug 30 2016 12:29 AM | Updated on Sep 4 2017 11:26 AM
పద్మాక్షి గుండంలో నిమజ్జనం లేదు
డీఆర్వో శోభ
హన్మకొండ అర్బన్ : గణపతి నవరాత్రులను విజయవంతం చేసేం దుకు అధికారులు కృషి చేయాల ని జిల్లా రెవెన్యూ అధికారి కె.శోభ సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమి టీ సభ్యులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డీఆర్వో శోభ మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడవచ్చనే విషయంపై భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాశాఖ ఎంపిక చేసిన పాఠశాలల్లో మట్టి విగ్రహాలను త యారు చేయించి ప్రజలకు పంపిణీ చేయాలని సూచించారు. మెప్మా, డీఆర్‌డీఏ స్వయం సహాయక సంఘాల ద్వారా మట్టి విగ్రహాలను తయారు చేయించి ముఖ్యమైన కూడళ్లలో తక్కువ ధరకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హన్మకొండ పద్మాక్షి గుండంలో ఈసారి వినాయకుల నిమజ్జనం లేదన్నారు. బంధం చెరువు, సిద్ధేశ్వర ఆలయం గుండం, చిన్నవడ్డేపల్లి, రంగం, బెస్తం, కట్టమల్లన్న చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం ఉంటుందన్నారు.
సీకేఎం కళాశాలలో వసతి..
నిమజ్జనంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వరంగల్ సీకేఎం కళాశాలలో వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. గణనాథులను నిమజ్జనం చేసే చెరువుల్లో సిల్ట్, నాచు, గుర్రపు డెక్క మొక్కలను తీయించాలని నీటిపారుదల అధికారులకు సూచించారు. మైనింగ్‌శాఖ అవసరమైన క్రేన్లను, మత్స్యశాఖ అధికారులు గజ ఈతగాళ్ల ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఊరేగింపుల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందు కు పోలీసులు ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు.
Advertisement
Advertisement