ఆరోగ్యం జాగ్రత్త సుమా ? | foulness at puskara ghats | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం జాగ్రత్త సుమా ?

Aug 16 2016 7:40 PM | Updated on Sep 4 2017 9:31 AM

ఆరోగ్యం జాగ్రత్త సుమా ?

ఆరోగ్యం జాగ్రత్త సుమా ?

పుష్కర యాత్రికలు డయోరియా (విరేచనాలు) బారిన పడుతున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నారు. గుంటూరుజిల్లాలో 700లకు పైగా డయేరియా కేసులు నమోదు కాగా, విజయవాడలో సైతం పలువురు భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు.

 
  విస్తరిస్తున్న విరేచనాలు 
  గుంటూరు, బెజవాడల్లో   
   భారీగా కేసులు 
  ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం
 
లబ్బీపేట:
పుష్కర యాత్రికలు డయోరియా (విరేచనాలు) బారిన పడుతున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నారు. గుంటూరుజిల్లాలో 700లకు పైగా డయేరియా కేసులు నమోదు కాగా, విజయవాడలో సైతం పలువురు భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. వారికి పుష్కర వార్డుల్లో చికిత్స చేసి పంపిస్తున్నారు. కలుషితనీరు. ఆహారం, పారిశుద్ధ్య సమస్యకారణంగానే  ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతున్న తరుణంలో అధికారులు ఇప్పటికైన అప్రమత్తం కాకుంటే వ్యాధుల చుట్టుముట్టే అవకాశం ఉందని చెపుతున్నారు. 
కలుషిత జలాల వల్లే 
మన తాగే నీరు , తీసుకునే ఆహారం కలుషితమైనప్పుడు డయోరియా సోకుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ప్రస్తుతం Mýృష్ణానదిలో తక్కువ నీటి మట్టం ఉండటం, పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. దీంతో మల మూత్రాలు, ఇతరత్రా వ్యర్థాలతో కలుషితమైన నీటిని స్నానం చేసేసమయంలో పొరపాటు నోట్లోకి వెళ్లినప్పుడు మింగేస్తే డయేరియా, టైఫాయిడ్, జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రవాహం తక్కువుగా ఉన్న Mýృష్ణవేణి, పద్మావతి ఘాట్‌లలో స్నానం చేసే వారికి ఇలాంటి సమస్యలు వచ్చినట్లు ్ల చెపుతున్నారు. చర్మ సమస్యలు, కంటి, గొంతు, చెవి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముంది. 
పుష్కర నగర్‌లలో పారిశుధ్య లేమి
యాత్రికులకు పుష్కరనగర్‌లలో ఉచితంగా అందజేస్తున్న అల్పాహారం, భోజనాలు కలుషితమైనా జబ్బులు వ చ్చే ప్రమాదముంది. అక్కడే పెద్దఎ తు ్తన టాయిలెట్స్‌ ఏర్పాటు చేయడం, స మీపంలోనే భోజనాలు వడ్డించడంతో ఆహారం కలుషితమవుతున్నట్లు చెపుతున్నారు. 
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి 
ఆరోగ్య వంతమైన పుష్కర స్నానం కోసం,.. నదిలో మునిగే సమయంలో నోట్లోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలి. నదిలో స్నానమయ్యాక మరోసారి మంచినీటితో స్నానం చేయడం ఉత్తమం. పుష్కర నగర్‌లో పెట్టే ఆహారం పరిశుభ్రంగా ఉందో లేదో చూడాలి. ఆ ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నా,  దుర్గం« దం వస్తున్నా అక్కడ ఆహారం తీసుకోరాదు. వీలయినంత వరకూ మినరల్‌ వాటర్‌నే తీసుకోవాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement