సాగుకు అవసరమైన అప్పు దొరకక మనస్తాపంతో ఓ రైతు బలవన్మరణం చెందాడు.
అప్పు దొరకక రైతు ఆత్మహత్య
Aug 19 2016 3:15 PM | Updated on Oct 1 2018 2:36 PM
రెబ్బెన: సాగుకు అవసరమైన అప్పు దొరకక మనస్తాపంతో ఓ రైతు బలవన్మరణం చెందాడు. ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఖైరిగూడలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బానోత్ మారుతి(28)కు పదెకరాల సొంత భూమి ఉంది. దీనికితోడు 12 ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం భూమిలో పత్తి సాగు చేశాడు. అయితే, ఇటీవల వర్షాలకు పత్తిలో కలుపు విపరీతంగా పెరిగింది. పెట్టుబడి కోసం తెలిసిన వారి వద్దకు గత పది రోజులుగా అప్పు కోసం తిరుగుతున్నాడు.
గత ఏడాది రుణం పెరిగిపోవటం, తాజాగా అప్పు పుట్టక పోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం చేనులోనే పురుగు మందుతాగి ఇంటికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Advertisement
Advertisement