కీసర మండలం భోగారంలోని హోలీమేరీ ఇంజనీరింగ్ హాస్టల్లో గిరీష్(20) అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
కీసర మండలం భోగారంలోని హోలీమేరీ ఇంజనీరింగ్ హాస్టల్లో గిరీష్(20) అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఫ్యానుకు వేలాడుతూ విద్యార్థులకు కనిపించాడు. ఈ విషయం విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మహత్యకు పాల్పడ్డ గిరిష్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా. సంఘటనాస్థలాన్ని స్థానిక సీఐ గురువారెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.