వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం దొరవారివేంపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది.
వరంగల్ : వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం దొరవారివేంపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీకి చెందిన సభ్యులు వారికి తారసపడ్డారు. దీంతో పోలీసులపైకి వారు కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దీంతో న్యూడెమోక్రసీ సభ్యులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే న్యూడెమోక్రసీ సభ్యుడిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే తప్పించుకున్న వారి కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.


