కరపత్రం విడుదల చేస్తున్న నాయకులు
షాద్‌నగర్ రూరల్ : వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాదిగ మహిళా సమాఖ్య జాతీయ సమన్వయకర్త కోళ్లవెంకటేష్ డిమాండ్ చేశారు.
షాద్‌నగర్ రూరల్ : వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాదిగ మహిళా సమాఖ్య జాతీయ సమన్వయకర్త కోళ్లవెంకటేష్ డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్‌కాలనీలో ఎస్సీవర్గీకరణ కోసం చేపట్టిన చలోఢిల్లీ కార్యక్రమం కరపత్రాలను తాలూకా కన్వీనర్ జోగుశారద ఆధ్వర్యంలో మంగళవారం విడుదల చేశారు. కోళ్లవెంకటేష్ మాట్లాడుతూ దళితులలోని 59 ఉపకులాలను వర్గీకరించి జనాభా ఆధారంగా ఏబీసీడీలుగా విభజించాలన్నారు. ఎస్సీ వర్గీకరణతో విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లలో దళితులకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 100రోజుల్లో వర్గీకరణను అమలు చేస్తామని ఇచ్చిన హామీ రెండేళ్లు గడుస్తున్నా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణ బిల్లును పెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ నెల 29న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న మహాధర్నా, ర్యాలీకి వేలాదిమంది పాల్గొంటారని, జిల్లానుంచి అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర్ర పచారకార్యదర్శి బుర్రరాంచంద్రయ్య, తాలూకా కన్వీనర్ జగన్, ఇటిక్యాల రాజు, శ్రీశైలం, బాల్‌రాజ్, ప్రవీణ్, మొగులమ్మ, సుగుణమ్మ, కవిత, సుగుణ, మహలక్ష్మి, ఈశ్వరమ్మ, సునిత, అమృత, రేణుక తదితరులు పాల్గొన్నారు.