సౌదీలో ఆగమై.. | district person missing in soudi arabia | Sakshi
Sakshi News home page

సౌదీలో ఆగమై..

Jul 27 2016 3:10 AM | Updated on Sep 4 2017 6:24 AM

సౌదీలో ఆగమై..

సౌదీలో ఆగమై..

మండలంలోని నల్లవెల్లికి చెందిన గూండ్ల గడ్డమీది సాయిలు(35) సౌదీ అరేబియా దేశంలోని దమామ్ నగరంలో తప్పిపోయి తిప్పలు పడుతున్నాడు.

తప్పిపోయిన నల్లవెల్లి వాసి
తిరిగి రప్పించాలని కోరుతున్న కుటుంబ సభ్యులు

ధర్పల్లి : మండలంలోని నల్లవెల్లికి చెందిన గూండ్ల గడ్డమీది సాయిలు(35) సౌదీ అరేబియా దేశంలోని దమామ్ నగరంలో తప్పిపోయి తిప్పలు పడుతున్నాడు. కుటుంబ భారాన్ని పోషించేందుకు ఆరేళ్ల క్రితం కూలీ పని చేసేందుకు సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఇతడికి వీసా ఇచ్చిన కంపెనీ వారు ఎవరూ రాకపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో దిగి తప్పి పోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. సాయిలుకు తల్లీ సాయవ్వ, భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

సౌదీ అరేబియాలో రోడ్డు వెంట దొరికింది తింటూ బతుకుతున్నట్లు సాయిలు భార్యకు రెండు సార్లు అక్కడి నుంచి ఫోన్ వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. తమ భర్తను ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. కుటుంబ పెద్ద దిక్కు లేక తాము పూట గడవని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు సాయిలును రప్పించి తమను కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement