
అనారోగ్యశ్రీగా మార్చారు
ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చిందని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీసంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వ వైఖరిని నిరసించారు.