తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotee heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Sep 18 2016 8:17 AM | Updated on Sep 4 2017 2:01 PM

తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం అధికంగా ఉంది.

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం అధికంగా ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చన భక్తులతో 28 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.  శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 89,260 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.52 కోట్లు అని వారు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement