గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదాకు డిమాండ్‌ | demond for group2 mains postpone | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదాకు డిమాండ్‌

May 2 2017 11:57 PM | Updated on Sep 5 2017 10:13 AM

గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదాకు డిమాండ్‌

గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదాకు డిమాండ్‌

ఏపీపీఎస్సీ గ్రూప్‌- 2 మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేయాలని ప్రజాపరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బలరామ్‌ డిమాండ్‌ చేశారు.

కర్నూలు(న్యూసిటీ) : ఏపీపీఎస్సీ గ్రూప్‌- 2 మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేయాలని ప్రజాపరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బలరామ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి నోటిఫికేషన్లు విడుదల చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ప్రిపరేషన్‌కు తగిన సమయంలో లేకపోవడంతో ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మెయిన్స్‌ పరీక్షను నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ సత్యనారాయణకు వినతిపత్రం  అందజేశారు. ధర్నాలో గ్రూప్‌-2 అభ్యర్థులు కె.విశ్వనాథ్, నరేష్, హుసేన్‌ నాయక్, రెడ్డినాయక్, నాగేష్, గురుప్రసాద్, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement