కూతురే కొడుకై.. | Daughter to make funerals of father | Sakshi
Sakshi News home page

కూతురే కొడుకై..

Dec 16 2015 10:03 AM | Updated on Sep 2 2018 4:37 PM

కూతురే కొడుకై.. - Sakshi

కూతురే కొడుకై..

కూతురే కుమారుడయ్యింది. పున్నామ నరకం నుంచి తప్పించే కొడుకు లేడనే లోటును తీర్చింది.

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన యువతి
వడమాలపేట: కూతురే కుమారుడయ్యింది. పున్నామ నరకం నుంచి తప్పించే కొడుకు లేడనే లోటును తీర్చింది. తండ్రికి తానే అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. వడమాలపేట మండలంలో మంగళవారం ఈ సంఘటన చేసుకుంది. ఈ మండలంలోని వడమాల గ్రామానికి చెందిన పూడి జగన్నాథం యాదవ్(65) రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్. బీపీ, షుగర్ వ్యాధులున్న అతనికి రెండు కిడ్నీలు పాడవడంతో కొంతకాలంగా ఇబ్బందిపడ్డాడు. ఆయనకు ఇంటర్ పూర్తిచేసిన ఒక్కగానొక్క కుమార్తె యామిని ఉన్నారు.
 
 ఏడాదిగా తల్లితో కలసి తండ్రిని ఆసుపత్రులకు తీసుకువెళ్లి చికిత్స చేయించింది. వారం వారం తిరుపతికి తీసుకెళ్లి డయాలసిస్ చేయించింది. అయినా ప్రయాజనం లేకపోయింది. సోమవారం రాత్రి జగన్నాథం మృతి చెందారు. అంత్యక్రియలు చేసేందుకు దాయాదులు ఉన్నా తాను నిర్వహిస్తేనే తన తండ్రికి ఆత్మకుశాంతి అంటూ.. యామిని తానే కార్యం పూర్తిచేసి రుణం తీర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement