వర్దా తుపానుతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
తిరుపతి: వర్దా తుపానుతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలో 40 విద్యుత్ స్తంభాలు, 30 చెట్లు కూలాయి. నారాయణవనంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పిచ్చాటూరులో 14, పుత్తూరులో 13, తిరుపతిలో 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో కాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ మూడు నియోజకవర్గాల్లో మంగళవారం విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.