జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణుపై క్రిమినల్ కేసు | criminal case on Jubilee former MLA Vishnu | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణుపై క్రిమినల్ కేసు

Jul 25 2016 5:09 PM | Updated on Mar 18 2019 9:02 PM

జూబ్లీహిల్స్ ఫిలిం కల్చరల్ క్లబ్ లో ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణు వర్ధన్ రెడ్డి తో పాటు మరో 5 మంది పై క్రిమినల్ కేసు నమోదైంది.

ఎఫ్‌ఎన్‌సీసీలో నిర్మాణంలో ఉన్న పోర్టిగో కూలిన ఘటనలో సహాయక చర్యలకు, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు క్లబ్‌లోని ఫర్నీచర్‌ను, ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు, తెలంగాణ రాష్ట్ర యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు మరో ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 147, 353, 448, 427, రెడ్‌విత్ 149 కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

 

ఆదివారం మధ్యాహ్నం విష్ణుతో పాటు అనిల్, వారి అనుచరులు అక్రమంగా ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రవేశించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించి అల్లరి మూకలతో ఆస్తులకు నష్టం కలిగించారని ఎస్‌ఐ జి. రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. టేబుళ్లను ధ్వంసం చేశారని గ్లాస్ డోర్స్ విరగ్గొట్టారని ప్రభుత్వ అధికారుల విధులకు భంగం కలిగించారని, భీభత్సం సృష్టించారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement