విత్తన వేరుశనగ ధర ఖరారు | cost fixed of groundnut seed | Sakshi
Sakshi News home page

విత్తన వేరుశనగ ధర ఖరారు

Nov 11 2016 1:30 AM | Updated on Sep 4 2017 7:44 PM

రబీ–2016కు సంబంధించి రాయితీతో పంపిణీ చేసే విత్తన వేరుశనగ ధర ఖరారు చేస్తూ వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : రబీ–2016కు సంబంధించి రాయితీతో పంపిణీ చేసే విత్తన వేరుశనగ ధర ఖరారు చేస్తూ వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కే–6తో పాటు మిగతా రకాలు కూడా క్వింటా పూర్తీ ధర రూ.6,877 కాగా అందులో 33.33 శాతం సబ్సిడీ రూ.2,292 పోనూ రైతు వాటాగా రూ.4,585 ప్రకారం ఖరారు చేశారు. ఈ రబీలో జిల్లాకు 15 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ కేటాయించినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే పంపిణీ చేపడుతామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement