వసతి గృహ విద్యార్థుల పట్ల స్థానిక హెచ్‌డబ్లూవోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్మల్ ఏఎస్‌డబ్ల్యూ ఎంఏ అలీం అన్నారు.
విద్యార్థుల పట్ల శ్రద్ధ అవసరం
Aug 2 2016 9:41 PM | Updated on Sep 4 2017 7:30 AM
దిలావర్‌పూర్ : వసతి గృహ విద్యార్థుల పట్ల స్థానిక హెచ్‌డబ్లూవోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్మల్ ఏఎస్‌డబ్ల్యూ ఎంఏ అలీం అన్నారు. మండల కేంద్రమైన దిలావర్‌పూర్‌లోని స్థానిక సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని విద్యార్థుల హాజరు శాతంతో పాటు పలు రికార్డులను ఆయన పరిశీలించారు. విద్యార్థుల భోజనం, ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు వహించాలన్నారు.
ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వసతిగృహం పరిశుభ్రంగా ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యం వక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ విధిగా ప్రతీనెలా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతీ వార్డెన్ స్థానికంగా ఉండాలని ఆయన ఆదేశించారు. హెచ్‌డబ్ల్యూవో రవీంధర్‌గౌడ్‌తోపాటు వసతిగృహ సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement