చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ భవనం సీజ్‌ | Complex Building Siege in Candralok | Sakshi
Sakshi News home page

చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ భవనం సీజ్‌

Dec 14 2016 2:26 AM | Updated on Sep 4 2017 10:38 PM

సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ చౌరస్తాలోని చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ను అధికారులు సీజఃŠ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్‌ బొంతు రామ్మోహన్,

రాంగోపాల్‌పేట్‌:  సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ చౌరస్తాలోని చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ను అధికారులు సీజఃŠ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్‌ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధరెడ్డిలు మంగళవారం భవనాన్ని సందర్శించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం భవనం రెయిలింగ్‌ కూలడంతో వెస్ట్‌మారేడుపల్లికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి దుర్మరణం పాలైన సంగతి విధితమే.

మృతుడి కుటుంబానికి రూ.2.5లక్షల నష్టపరిహారం: మేయర్‌
భవనం  రెయిలింగ్‌ కూలిన ఘటనలో  మృతి చెందిన దుర్గయ్య కుటుంబానికి రూ.2లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రకటించారు. ఆపద్భందు పథకం కింద మరో రూ.50 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్మిక శాఖ నుంచి ఏదైనా ఆర్థిక సహాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ను సీజ్‌ చేసి జేఎన్‌టీయూ నివేదిక కోరనున్నట్లు తెలిపారు. పురాతన భవనాల యజమానులు, అసోసియేషన్లు  ఇంజనీర్‌లను ఏర్పాటు చేసుకుని వాటిని పటిష్టం చేయించుకోవాలని కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి సూచించారు.  భవనంపై ఉన్న సెల్‌టవర్లు, హోర్డింగ్‌లపై విచారణ చేపడతామన్నారు.

మేయర్‌ వెళ్లిన 5 నిమిషాలకే..
 మేయర్‌ మీడియాతో మాట్లాడి వెళ్లిన 5 నిమిషాలకే రెయిలింగ్‌లోని మరికొంత ఊడి పడింది. అంతకు ముందు మేయర్‌ నిలుచున్న చోటుకు 5 అడుగుల దూరంలోనే శిథిలాలు పడటం గమనార్హం. మళ్లీ కూలే ప్రమాదం ఉండటంతో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను ఎస్డీరోడ్‌ గుండా మళ్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement