రేపు కొత్త ఇంట్లోకి సీఎం | CM tomorrow to the new house | Sakshi
Sakshi News home page

రేపు కొత్త ఇంట్లోకి సీఎం

Nov 23 2016 4:18 AM | Updated on Aug 21 2018 11:41 AM

రేపు కొత్త ఇంట్లోకి సీఎం - Sakshi

రేపు కొత్త ఇంట్లోకి సీఎం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త ఇంట్లోకి మారుతున్నారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త ఇంట్లోకి మారుతున్నారు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు నూతన గృహ ప్రవేశం చేయనున్నారు. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యారుు. బేగంపేటలో ప్రస్తుతమున్న సీఎం క్యాంపు ఆఫీసు వెనుక 9 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మించారు. ఆర్ అండ్ బీ విభాగం రూ.38 కోట్ల అంచనా వ్యయంతో 3 బ్లాక్‌లుగా ఈ నిర్మా ణాలు చేపట్టింది. దాదాపు వెరుు్య మందితో సమావేశమ య్యేలా మీటింగ్ హాల్ నిర్మించారు. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వివిధ రకాల మొక్కలను సేకరించి ఇక్కడ పెంచే బాధ్యతను హెచ్‌ఎండీఏకు అప్పగించారు.

మార్చి నెలలో ప్రారంభించిన ఈ నిర్మాణ పనులను ఆర్ అండ్ బీ అధికారులు శరవేగంగా తొమ్మిది నెలల్లోపే పూర్తి చేశారు. ఈ ప్రాంతంలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో ఉన్న క్వార్టర్లను ఇప్పటికే కూల్చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఎం ముఖ్య కార్యదర్శితో పాటు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్‌లకు ఇక్కడే నివాస వసతి కల్పించాలని భావిస్తున్నారు. ప్రస్తుత సీఎం నివాసాన్ని రాష్ట్ర అతిథి గృహంగా, ప్రస్తుత క్యాంపు కార్యాలయాన్ని ఐజీ భద్రతా కార్యాలయంగా మార్చాలని ఇప్పటికే నిర్ణరుుంచారు.
 
 గృహ ప్రవేశానికి రండి  
 గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ఆహ్వానం
 సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల ఢిల్లీ పర్యటన నుంచి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. గురువారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయంలో గృహ ప్రవేశం చేయనున్నారు. గృహ ప్రవేశ మహోత్సవానికి గవర్నర్‌ను ఆయన ఆహ్వానించినట్లు సమాచారం. అంతేగాక తన ఢిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ వివరాలపై గవర్నర్‌తో దాదాపు గంట సేపు ముచ్చటించారు.

పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లడం తెలిసిందే. ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు సీఎం చేసిన సూచనలపై ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థారుులో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు బుధవారం ప్రత్యేక కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విశేషాలు, తదనంతర పరిణామాలపై గవర్నర్, సీఎం భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement