ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతికి కేసీఆర్ | CM KCR go to amaravathi inauguration on Helicopter | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతికి కేసీఆర్

Oct 22 2015 10:31 AM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అమరావతికి హెలికాప్టర్లో బయలుదేరారు.

నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అమరావతికి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతోపాటు మంత్రులు ఈటల రాజేందర్, జగదీష్రెడ్డి ఉన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఉదయం 10.15 గంటలకు వారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి బయల్దేరారు.

ముందుగా కేసీఆర్ గన్నవరం చేరుకుని... అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అమరావతిలో  శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న ఉద్దండరాయుని పాలెం చేరుకుంటారు.  ఆ కార్యక్రమం పూర్తికాగానే 2.40 గంటలకు ఆయన సూర్యాపేటకు తిరుగు ప్రయాణం అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement