మేయర్ దంపతుల హత్యకేసులో నిందితుడిపై దాడి | chittoor mayor followers attacks on murder case accused in police station | Sakshi
Sakshi News home page

మేయర్ దంపతుల హత్యకేసులో నిందితుడిపై దాడి

Dec 25 2015 2:01 AM | Updated on Aug 21 2018 9:20 PM

మేయర్ దంపతుల హత్యకేసులో నిందితుడిపై దాడి - Sakshi

మేయర్ దంపతుల హత్యకేసులో నిందితుడిపై దాడి

చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్యకేసులో మరో నిందితుడు గురువారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లోంగిపోయాడు.

చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్యకేసులో మరో నిందితుడు గురువారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లోంగిపోయాడు. ఈ కేసులో పదో నిందితుడిగా ఉన్న మొగిలి(35) హత్య జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నాడు.

గురువారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మొగిలి లొంగిపోవటాన్ని తెలుసుకున్న కఠారి అనుచరులు అక్కడికి చేరుకుని అతనిపై దాడిచేశారు. ఈ ఘటనలో మొగిలికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కఠారి అనుచరులను తీవ్రంగా హెచ్చరించడంతో అతనిని వదిలేశారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement