చెంగాళమ్మ ఆలయ హుండీ లెక్కింపు | Chengalamma temple hundi counting | Sakshi
Sakshi News home page

చెంగాళమ్మ ఆలయ హుండీ లెక్కింపు

Oct 27 2016 11:37 PM | Updated on Sep 4 2017 6:29 PM

చెంగాళమ్మ ఆలయ హుండీ లెక్కింపు

చెంగాళమ్మ ఆలయ హుండీ లెక్కింపు

సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ హుండీని చైర్మన్‌ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి సమక్షంలో గురువారం లెక్కించారు.

సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ హుండీని చైర్మన్‌ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి సమక్షంలో గురువారం లెక్కించారు. 3 నెలల కాలానికి గానూ హుండీ ద్వారా రూ.39లక్షల ఆదాయం సమకూరినట్లు ఆయన తెలిపారు. హుండీ, దర్శనం టికెట్లు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన మొత్తం రూ.60లక్షలను శుక్రవారం బ్యాంకులో డిపాజిట్‌ చేయనున్నట్లు వివరించారు. అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ.30,734 ఆదాయం లభించిందని, ఈ మొత్తాన్ని అన్నదానానికి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సుధాకర్‌బాబు, ఆలయ ఈఓ ఆళ్ల శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి సభ్యులు చిలకా యుగంధర్‌యాదవ్, అలవల సూరిబాబు, ఆకుతోట రమేష్, పిట్ల సుహాసిని, చిట్టేటి పెరుమాళ్లు, వేనాటి గోపాల్‌రెడ్డి, పులుగు శ్రీనివాసులురెడ్డి, కీసరపల్లి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement