గ్రామసమీపంలో చిరుత సంచారం | Cheetah wandering near Chagall village | Sakshi
Sakshi News home page

గ్రామసమీపంలో చిరుత సంచారం

Apr 10 2016 11:07 AM | Updated on Sep 3 2017 9:38 PM

స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్ (వరంగల్) : స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లిన లేగదూడను చిరుతపులి వేటాడి చంపింది. దీంతో గ్రామస్థులు చిరుతను బంధించాలని అటవీ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement