మండల పరిధిలోని కొత్తబురుజు గ్రామంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన భూ వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది.
భూవివాదంలో ఎస్‌ఐపై కేసు నమోదు
Jun 24 2017 9:53 PM | Updated on Sep 2 2018 3:51 PM
డోన్ టౌన్ : మండల పరిధిలోని కొత్తబురుజు గ్రామంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన భూ వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. గ్రామానికి చెందిన రాఘవయ్య ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని బుక్కరాయపట్నం ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఈయనకు.. వరదరాజులు, షేకన్న అనే తన సొంత అన్నదమ్ములతో భూవివాదం ఉంది. ఈవిషయంలో శనివారం ఒకరినొకరు అసభ్యంగా దూషించుకున్నారు. రాఘవయ్య ఫిర్యాదు మేరకు అతని సోదరులతో పాటు వదిన లక్ష్మీదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరదరాజులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుక్కరాయపట్నం ఎస్‌ఐ రాఘవయ్య పై కూడా కేసు నమోదు చేశామని డోన్ రూరల్ ఎస్‌ఐ రామసుబ్బయ్య తెలిపారు.
Advertisement
Advertisement