ఇక బిజినెస్‌మెన్స్ క్రికెట్ | bussinesmens will going toplay cricket | Sakshi
Sakshi News home page

ఇక బిజినెస్‌మెన్స్ క్రికెట్

Aug 20 2016 10:50 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఇక బిజినెస్‌మెన్స్ క్రికెట్ - Sakshi

ఇక బిజినెస్‌మెన్స్ క్రికెట్

బిజినెస్‌ సర్కిల్‌ కూడా తమకంటూ ప్రత్యేకించిన క్రికెట్‌ పోటీలకు శ్రీకారం చుట్టింది.

సాక్షి,హైదరాబాద్: సినిమా రంగం, కార్పొరేట్‌ రంగం... ఇలా ప్రతి రంగానికి చెందిన వారు క్రికెట్‌ లీగ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నట్టే ఇప్పుడు బిజినెస్‌ సర్కిల్‌ కూడా తమకంటూ ప్రత్యేకించిన క్రికెట్‌ పోటీలకు శ్రీకారం చుట్టింది. నగరానికి చెందిన పలువురు వ్యాపార రంగ ప్రముఖుల ఆధ్వర్యంలో బీజేవైఎం టీ20 క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించారు. వ్యాపార వర్గాల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు గాను ఈ క్రికెట్‌ లీగ్‌ ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోటీ లోగోను మోడల్స్‌ ఆవిష్కరించారు.               
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement