హైదరాబాదీలకు వార్నర్ మెసేజ్ | David warner says thanks to India | Sakshi
Sakshi News home page

హైదరాబాదీలకు వార్నర్ మెసేజ్

Oct 15 2017 12:37 PM | Updated on Sep 4 2018 4:52 PM

David warner says thanks to India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇండియాకు థ్యాంక్స్‌ చెప్పాడు. టూర్‌ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఆయన తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ పోస్టు చేశాడు. ‘మాకు​ మరోసారి ఆతిథ్యం ఇచ్చిన భారత్‌కు కృతజ్ఞతలు. మా ఆటగాళ్లకు ఇండియా వచ్చి క్రికెట్‌ ఆడటం చాలా ఇష్టమ’ని వార్నర్‌ పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో​ జరగాల్సిన మూడో టి-20 మ్యాచ్‌ రద్దుపై కూడా స్పందించాడు. ‘మ్యాచ్‌ను తిలకించేందుకు ఎంతో ఆతురతతో ఎదురు చూసింటారు. ఆ మ్యాచ్‌ రద్దు అయినందుకు అభిమానులకు సారీ. వచ్చే సంవత్సరం మళ్లీ కలుద్దామ’ని పోస్టు చేశాడు.

ఈ పోస్టుపై కొంతమంది అభిమానులు స్పందించి, థ్యాంక్స్‌ కూడా తెలిపారు. మీరు వచ్చే సంవత్సరం ఆడే ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్నామని తిరిగి పోస్టు చేశారు. అంతేకాక మున్ముందు వార్నర్‌ ఆడబోయే మ్యాచ్‌లకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్‌ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మూడో టి-20 మ్యాచ్‌ రద్దు కావడంతో టి-20 సిరిస్‌ 1-1తో సమం అయింది. వర్షంతో మూడో టి-20 రద్దవడంతో హైదరాబాద్‌ నగర ప్రజలు తీవ్ర  నిరాశ చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement