పండ్ల వ్యాపారి ఆత్మహత్య | businessman suicides | Sakshi
Sakshi News home page

పండ్ల వ్యాపారి ఆత్మహత్య

Mar 16 2017 11:31 PM | Updated on Sep 5 2017 6:16 AM

హిందూపురం హస్నాబాద్‌కు చెందిన పండ్ల వ్యాపారి హిదాయత్‌(32) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : హిందూపురం హస్నాబాద్‌కు చెందిన పండ్ల వ్యాపారి హిదాయత్‌(32) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. హిదాయత్‌ అత్తవారింట్లోనే ఇల్లరికంగా ఉంటున్నాడు. ఇటీవలే మామ చనిపోవడంతో కుటుంబ పోషణ అతనిపై పడింది. ఈ నేపథ్యంలో భార్యకు ఇటీవలే కాలు విరిగి ఆపరేషన్‌ జరగడంతో నడవలేని స్థితిలో ఉంది. దీంతో మనస్థాపానికి గురైన అతను బుధవారం రాత్రి భోజనం చేసి పైగదికి వెళ్లి పడుకున్నాడు.

ఉదయం చూసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులకు సమాచారం అందించగా, వారొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతుడికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. కేసు విచారణలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement