మండలంలోని ఎత్తిపోతల, విజయపురిసౌత్‌లో లాంచీస్టేషన్‌ను పర్యాటక అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ రామకృష్ణ మంగళవారం పరిశీలించారు.
పుష్కరాలకు ఐదు లాంచీలు సిద్ధం
Jul 19 2016 8:09 PM | Updated on Apr 3 2019 5:26 PM
విజయపురిసౌత్: మండలంలోని ఎత్తిపోతల, విజయపురిసౌత్‌లో లాంచీస్టేషన్‌ను పర్యాటక అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ రామకృష్ణ మంగళవారం పరిశీలించారు. అనంతరం లాంచీస్టేషన్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ పుష్కరాలలోపు ఐదు లాంచీలను పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. లాంచీలకు నాగసిరి ఇంటీరియర్ డెకరేషన్, పెయింటింగ్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎత్తిపోతల వసతి గృహాల్లో ఏసీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాటర్‌ఫాల్స్ వద్ద మరమ్మతులకు గురైన లైటింగ్ పనులను పూర్తి చేస్తున్నట్లు వివరించారు. అనంతరం మేకలగొందిలో లాంచీలను పరిశీలించారు. ఆయన వెంట పర్యాటక అభివృద్ధి సంస్థ డీవీఎం శ్యాంప్రసాద్, లాంచీ యూనిట్æమేనేజర్ వీ సూర్యచందర్‌రావు, ఎత్తిపోతల మేనేజర్ దత్తు ఉన్నారు.
Advertisement
Advertisement