మఠం భూములు అన్యాక్రాంతం కానివ్వం | Be alienation of land Matham | Sakshi
Sakshi News home page

మఠం భూములు అన్యాక్రాంతం కానివ్వం

Nov 28 2016 11:42 PM | Updated on Jun 1 2018 8:39 PM

మఠం భూములు అన్యాక్రాంతం కానివ్వం - Sakshi

మఠం భూములు అన్యాక్రాంతం కానివ్వం

గవిమఠానికి సంబంధించి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు కర్ణాటకలో ఉన్నాయని, వాటిని అన్యాక్రాంతం కానివ్వబోమని దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆనంద్‌రావు తెలిపారు. సోమవారం ఉరవకొండ గవిమఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనందరావు మాట్లాడారు.

ఉరవకొండ :  గవిమఠానికి సంబంధించి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు కర్ణాటకలో ఉన్నాయని, వాటిని అన్యాక్రాంతం కానివ్వబోమని దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆనంద్‌రావు తెలిపారు. సోమవారం ఉరవకొండ గవిమఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనందరావు మాట్లాడారు. బళ్ళారి, రాయచూరు, మైసూర్, హంపి తదితర ప్రాంతాల్లో దాదాపు 1600 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయని, ఇందులో కేవలం 220 ఎకరాలు మాత్రమే మఠం ఆధీనంలో ఉన్నాయని చెప్పారు. మిగతా భూములు ఎవరు అనుభిస్తున్నారో తెలుసుకొని వారి వద్ద నుండి భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు. రెవెన్యూ రికార్డులు సేకరించిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో పాటు మీఇంటికి మీభూమి కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా 5 వేల ఎకరాల దేవాదాయ శాఖ భూములను గుర్తించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement