రాజ్యాధికారం దిశగా బీసీలు ఐక్య పోరాటం చేయాలి | bc community unity main | Sakshi
Sakshi News home page

రాజ్యాధికారం దిశగా బీసీలు ఐక్య పోరాటం చేయాలి

Jan 24 2017 12:09 AM | Updated on Sep 5 2017 1:55 AM

బీసీలు రాజ్యాధికారం దిశగా ఐక్యతతో పోరాటం చేయాలని అఖిల భారత యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు కుండల సాయికుమార్‌ పిలుపు నిచ్చారు. మాధవపట్నం గ్రామంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బీసీ కులాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా

  • అఖిల భారత యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు
  • మాధవపట్నం (సామర్లకోట) :
    బీసీలు రాజ్యాధికారం దిశగా ఐక్యతతో పోరాటం చేయాలని అఖిల భారత యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు కుండల సాయికుమార్‌ పిలుపు నిచ్చారు. మాధవపట్నం గ్రామంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బీసీ కులాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ కులాల వారికి పల్లకి మోయడానికే ఉపయోగించుకొంటున్నారని, ఎన్నికలు పూర్తయిన తరువాత ఉపయోగించుకొని వదలి వేస్తున్నారన్నారు. బీసీల్లోని అన్ని కులాలకు చెందిన వారు ఐక్యంగా ఉండటంతో రాజ్యాధికారం వస్తుందని చెప్పారు. బీసీ కులాల పెద్దాపురం నియోజక వర్గ కన్వీనర్‌గా పెంకే వెంకటేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రజక చైతన్య సంస్థ జిల్లా కార్యదర్శి కురుమళ్ల రాజబాబు, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వెంకటే«శ్వర్లు, అఖిల భారత పద్మశాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణగంట సత్యనారాయణ, బీజీ ఐక్య వేదిక కార్యదర్శి రాయుడు మోజెస్, 93 బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు, ఏపీ జేఏసీ కో కన్వీనర్‌ మాకిరెడ్డి భాస్కరగణేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement